జడ్చర్ల పట్టణంలోని వేద 9 రెస్టారెంట్‌లో భోజనం చేసిన ఒక కస్టమర్‌కు ఫుడ్ పాయిజన్ కావడంతో ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత శనివారం ఆ రెస్టారెంట్‌లో తనిఖీలు నిర్వహించారు.

వేద 9 హోటల్‌లో తెలంగాణ చికెన్ కర్రీ తిన్న కస్టమర్‌కు 15 నిమిషాల్లోనే ఒంటిపై దద్దుర్లు వచ్చాయి. దీంతో ఆ కస్టమర్ వెంటనే ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

కస్టమర్ ఫిర్యాదు మేరకు హోటల్‌లో తనిఖీలు చేసిన ఫుడ్ ఇన్‌స్పెక్టర్ వంటగది అపరిశుభ్రంగా ఉండటాన్ని గుర్తించారు.

ఆహార పదార్థాల నిల్వలో కూడా లోపాలు ఉన్నట్లు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ శ్రీలత తన తనిఖీలలో కనుగొన్నారు.