గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల లోపు అన్ని ప్రభుత్వ ఉద్యోగ ప్రకటనలు విడుదల చేయాలని ఏజెన్సీ సాధన కమిటీ, నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ సోమేష్ డిమాండ్ చేశారు. శనివారం ఉట్నూర్ లో నిరుద్యోగులతో కలిసి ఆయన మాట్లాడారు.
ప్రభుత్వం మెగా డీఎస్సీ ప్రకటనను విడుదల చేయాలని, ఏజెన్సీ డీఎస్సీను ప్రకటించాలని సోమేష్ కోరారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఆయన అన్నారు.
ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని జాదవ్ సోమేష్ డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలోని 29 సెక్టార్లలో ఉద్యోగాలను గుర్తించి ప్రకటనలు ఇవ్వాలని ఆయన కోరారు.
అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను గుర్తించి, రాబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు పూర్తి అయ్యేలోగా ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. నిరుద్యోగులకు న్యాయం చేసి, ఉద్యోగ నియామక క్యాలెండర్ ప్రకటించాలని జాదవ్ సోమేష్ స్పష్టం చేశారు.
