కాకినాడ జిల్లా చిన్నంపేట వద్ద ఆర్టీసీ బస్సులో సీటు వివాదం తీవ్ర ఘర్షణకు దారితీసింది. సుమారు 30 మంది యువకులు కర్రలు, రాడ్లతో మహిళలపై దాడి చేశారు.
ఈ దాడిలో ముగ్గురు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
సీటు ఇవ్వలేదన్న కారణంతో యువకులు ఈ దారుణానికి పాల్పడ్డారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులు ఈ ఘటనతో భయాందోళన చెందారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దాడికి పాల్పడిన యువకుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.