ఖమ్మం జిల్లా వైరాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. దసరా సెలవులకు ఇంటికి వచ్చిన 19 ఏళ్ల ఇంజినీరింగ్ విద్యార్థి రాఘవ గుండెపోటుతో మృతిచెందాడు. ఈ ఘటన తండ్రి కళ్లముందే జరగడంతో కుటుంబ సభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. 'నాన్నా ఈ చొక్కా బాగుంది' అని తండ్రితో చెబుతూనే రాఘవ కుప్పకూలిపోయాడు. కళ్లముందే కుమారుడు ప్రాణాలు కోల్పోవడంతో తండ్రి శోకసంద్రంలో మునిగిపోయాడు.
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. యువకుడి అకాల మరణం పట్ల స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాఘవ మృతితో వైరాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఇలాంటి ఘటనలు యువత ఆరోగ్యంపై ఆందోళన కలిగిస్తున్నాయి.