రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మె చేస్తున్న నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) ఉద్యోగులకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. హైదరాబాద్‌లో మాజీ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్ సమక్షంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ప్రతినిధులు గురువారం కేటీఆర్‌ను కలిశారు.
ఈ సమావేశంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ ప్రతినిధులు తమ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న న్యాయమైన డిమాండ్లు, ఉద్యోగ భద్రతతో సహా రాష్ట్రవ్యాప్తంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
కేటీఆర్ మద్దతుతో తమ ఉద్యమానికి మరింత ధైర్యం, నూతనోత్సాహం పెరిగిందని ఎన్‌హెచ్‌ఎం జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రావు పుట్ట తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ తరఫున కేటీఆర్, వినయ్‌భాస్కర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎన్‌హెచ్‌ఎం జేఏసీ అధికార ప్రతినిధి డాక్టర్ శ్రీనివాస్, హనుమకొండ ప్రతినిధి డాక్టర్ విజయ్‌కుమార్, మేడ్చల్ ప్రతినిధి డాక్టర్ కుమార్ పాల్గొన్నారు.
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల సమస్యలకు బీఆర్‌ఎస్ మద్దతు లభించడంతో, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు వైద్య సేవలు అందించే ఈ ఉద్యోగుల డిమాండ్లకు మరింత బలం చేకూరింది. ఇది వారి ఉద్యమానికి కీలక మలుపు కానుంది.
