కూసుమంచి మండలం నరసింహులగూడెం గ్రామానికి చెందిన 13 ఏళ్ల వినయ్ బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలవాలన్న వినయ్ కోరికను కుటుంబ సభ్యులు పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డికి తెలియజేశారు.

శనివారం హైదరాబాద్‌లోని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి నివాసంలో కేటీఆర్ వినయ్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ బాలుడితో ఆప్యాయంగా మాట్లాడారు.

వినయ్ కోరిక మేరకు కేటీఆర్ అతనితో కలిసి ఫోటో దిగారు. దీంతో బాలుడి కోరిక నెరవేరింది.

అనంతరం కేటీఆర్ బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడి వినయ్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

వినయ్‌కు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు తన వంతు సహకారం అందిస్తానని కేటీఆర్ కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.