ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీ పట్టాలతో బయటికొస్తున్నా, వారిలో కొద్దిమంది మాత్రమే మంచి ఉద్యోగాలు సాధిస్తున్నారు. మిగిలిన వారికి సరైన ఉద్యోగ అవకాశాలు దొరకడం లేదు. దేశవ్యాప్తంగా లక్షలాది అప్రెంటిస్‌షిప్ సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ, యువత వాటిని సద్వినియోగం చేసుకోవడం లేదు. డిగ్రీలు ఉన్నా, స్థిరమైన ఉద్యోగాల కంటే గిగ్ వర్క్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పరిస్థితికి గల కారణాలపై విశ్లేషణ అవసరం.