చిత్రకారిణి లలితా కపిలవాయి చిత్రాలతో 'కళాప్రయాణం – కళ, శాశ్వత సంప్రదాయాలు, స్వీయ అన్వేషణ ద్వారా ఒక ప్రయాణం' పేరుతో హైదరాబాద్‌లోని స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మూడు రోజుల ప్రదర్శన జరుగుతోంది. సోమవారం (అక్టోబర్ 26) చివరి రోజు.

ప్రదర్శనలో ఏముంది?

  • పహాడీ, పిచ్వాయ్, మైసూరు, తంజావూరు సంప్రదాయ శైలుల్లో వేసిన చిత్రాలు
  • పహాడీ సంప్రదాయంలోని గులేర్, కాంగ్డా శైలుల స్ఫూర్తితో వేసిన చిత్రాలు

హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాకు చెందిన పహాడీ సూక్ష్మచిత్ర కళాకారుడు డాక్టర్ విజయ్ శర్మ ఈ ప్రదర్శనకు క్యురేటర్‌గా వ్యవహరించారు.

వివరాలు

  • వేదిక: స్టేట్ ఆర్ట్ గ్యాలరీ, హైదరాబాద్
  • సమయం: ఉదయం 11 నుంచి సాయంత్రం 7 వరకు
  • ప్రవేశం: ఉచితం