చెన్నైలో పదేళ్ల బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ న్యాయవాదిని పోలీసులు అక్టోబర్ 18న అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
స్థానిక అంబత్తూరుకు చెందిన బాలిక తల్లిదండ్రులు శనివారం బయటకు వెళ్లగా, బాలిక ఇంట్లో ఒంటరిగా ఉంది. ఈ సమయంలో ఇంటి యజమాని బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక ఏడుస్తూ విషయం చెప్పింది. దీంతో తల్లిదండ్రులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి, ఇంటి యజమాని అయిన న్యాయవాదిని అరెస్ట్ చేశారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.