నాగర్‌కర్నూల్‌లోని మంతటి చౌరస్తా వద్ద ఉన్న మహాలక్ష్మి రైస్‌మిల్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ రైస్‌మిల్ యాజమాన్యంతో పాటు 13 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
కస్టమ్ మిల్లింగ్ రైస్ (CMR)ను పక్కదారి పట్టించిన రైస్‌మిల్లులపై పౌర సరఫరాల శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ వ్యవహారంలో విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌లకు చెందిన బృందం కూడా దర్యాప్తులో పాలుపంచుకుంది.
గురువారం, శుక్రవారాల్లో రైస్‌మిల్లులపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడులలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి.
మహాలక్ష్మి రైస్‌మిల్లులో 3,774.818 మెట్రిక్ టన్నుల బియ్యం తారుమారైనట్లు అధికారులు నిర్ధారించారు. ఈ అక్రమాలపై మరింత లోతైన విచారణ జరుగుతోంది.