న్యూజెర్సీ: అమెరికా విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం సిద్ధమవుతున్న తెలుగు విద్యార్థులకు మద్దతుగా మన అమెరికా తెలుగు సంఘం (మాటా), టెస్ట్ ప్రెప్ పండిట్స్ సంస్థతో కలిసి ఆన్లైన్ డిజిటల్ SAT (DSAT) శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఒక్కో విద్యార్థికి నామమాత్రపు ఫీజు 75 డాలర్లుగా నిర్ణయించినట్లు నిర్వాహకులు బుధవారం తెలిపారు.
షెడ్యూల్, మాక్ టెస్టుల వివరాలు
డిసెంబర్ 2 నుంచి డిసెంబర్ 18 వరకు ప్రతి బుధ, శుక్రవారాల్లో (మొత్తం 6 రోజులు, రోజుకు 2 సెషన్లు) 12 గంటల పాటు ఆన్లైన్ తరగతులు జరుగుతాయి. ఇందులో 4 గంటలు మ్యాథమెటిక్స్, 4 గంటలు ఇంగ్లీష్ రీడింగ్, 4 గంటలు ఇంగ్లీష్ రైటింగ్ బోధిస్తారు. అమెరికా ఈస్టర్న్ టైమ్ (EST) ప్రకారం రాత్రి 7:00–8:00, 8:10–9:10 గంటలకు సెషన్లు ఉంటాయి.
అధ్యాపకులు, రిజిస్ట్రేషన్
టెస్ట్ ప్రెప్ పండిట్స్ సీఈఓ అన్వర్ మ్యాథమెటిక్స్, రాణా కొరాన్ రీడింగ్, నబిల్ రైటింగ్ విభాగాలను బోధిస్తారు. కోర్సులో భాగంగా నవంబర్ 29న మొదటి పూర్తిస్థాయి ప్రాక్టీస్ టెస్ట్, డిసెంబర్ 19న చివరి మాక్ టెస్ట్ నిర్వహిస్తారు. ఆసక్తి గల విద్యార్థులు testpreppundits.com లేదా mata-us.org ద్వారా నమోదు చేసుకోవచ్చని మాటా ప్రకటించింది.



