మెదక్ జిల్లా నర్సాపూర్ లో ఫుడ్ పాయిజన్ తో ఒక యువకుడు మరణించగా, మరో 18 మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారి పక్కన ఉన్న వన్ ప్యాలెస్ రెస్టారెంట్ లో జరిగింది.

నర్సాపూర్ కు చెందిన సాయిరాం (19) తన స్నేహితులతో కలిసి ఈ నెల 12న వన్ ప్యాలెస్ రెస్టారెంట్ లో బిర్యానీ, రోటీ, కర్రీ తిన్నారు.

మంగళవారం వారు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురవడంతో వివిధ ఆస్పత్రులకు తరలించారు.

సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయిరాం బుధవారం మృతిచెందాడు.

మెదక్-హైదరాబాద్ జాతీయ రహదారిపై రోడ్డు పక్కన ఉన్న రెస్టారెంట్లలో ఆహారం తీసుకునేవారు జాగ్రత్తగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.