మనిషి సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలంటే శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం కూడా సరిగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యం గురించి ప్రజలకు తెలియజేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం నిర్వహిస్తారు. ఈ దినోత్సవం మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడానికి ఉద్దేశించినది.

అక్టోబర్ నెల మొత్తాన్ని మానసిక ఆరోగ్య మాసంగా పరిగణిస్తున్నారు. ఈ నెల రోజులు ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.

భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మానసిక ఆరోగ్య సమస్యలు కూడా అదే వేగంతో పెరుగుతున్నాయని పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో దేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నారు.