జీవితంలో అత్యంత క్లిష్టమైన దశలో ఉన్న రోగులకు అండగా నిలుస్తున్న ఖాజాగూడలోని 'స్పర్శ్ హాస్పీస్' తెలంగాణకు గర్వకారణమని రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
స్పర్శ్ హాస్పీస్ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం స్థానికంగా ప్రత్యేక వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నుంచి గైడ్ స్టార్ ఇండియా గుర్తింపు ధ్రువపత్రాన్ని జగదీశ్‌బాబు రామడుగు అందుకున్నారు.
ఈ కార్యక్రమంలో డా.జీవీరావు, డా.నాగేశ్వరరెడ్డి, జయేశ్‌రంజన్, సుబ్రహ్మణ్యం రాయదుర్గం తదితరులు పాల్గొన్నారు.
క్లిష్టమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి స్పర్శ్ హాస్పీస్ అందిస్తున్న సేవలు రాష్ట్ర ప్రజలకు ఎంతో ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ఈ సంస్థ సేవలు తెలంగాణ సమాజానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి.