మోడల్ స్కూల్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఐదు సంఘాలు మాడల్ స్కూల్స్ యూనియన్స్ జేఏసీ (ఎంఎస్జేఏసీ)గా ఏర్పడ్డాయి. ఈ జేఏసీ దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. మొత్తం 12 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వానికి 15 రోజుల గడువు విధించింది. ఈ నెల 8వ తేదీన ప్రభుత్వానికి నోటీసు ఇవ్వగా, ఈ నెల 23తో ఈ గడువు ముగియనున్నది.
గడువు ముగిసిన తర్వాత ఉద్యమం తప్పదని ఎంఎస్జేఏసీ హెచ్చరించింది. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జేఏసీ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులు ఆందోళన కార్యక్రమాలను తీవ్రతరం చేస్తారని స్పష్టం చేసింది.