అమెరికాలోని బోస్టన్‌లో తెలంగాణ విద్యార్థిని అదృశ్యమయ్యారు. నల్గొండకు చెందిన శ్రీజ కోయ (23) యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ బోస్టన్‌లో చదువుతున్నారు. సోమవారం (నవంబర్ 2) రాత్రి సుమారు 9:45 గంటలకు డోర్చెస్టర్‌లోని ఎడిసన్ గ్రీన్ ప్రాంతంలోని తన ఇంటి నుంచి బయటకు వెళ్లిన ఆమె తిరిగి రాలేదు. మంగళవారం (నవంబర్ 3) ఆమె కనిపించడం లేదని ఫిర్యాదు అందింది.

పోలీసులు చెప్పిన వివరాలు

  • ఎత్తు సుమారు 5 అడుగుల 3 అంగుళాల నుంచి 5 అడుగుల 5 అంగుళాలు, సన్నని శరీరం, నల్లని జుట్టు.
  • చివరిసారి నల్ల జాకెట్, నీలం జీన్స్ ధరించి ఉన్నారు.
  • కార్సన్ బీచ్ లేదా హార్బర్ పాయింట్ ప్రాంతంలో ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

సమాచారం ఇవ్వాలంటే

  • 911 లేదా డోర్చెస్టర్ (డిస్ట్రిక్ట్ సీ-11) డిటెక్టివ్‌లు: (617) 343-4335
  • పేరు చెప్పకుండా సమాచారం: 1-800-494-8477 (TIPS), లేదా 27463కు "TIP" అని మెసేజ్

ఆమెను వెతికేందుకు బోస్టన్‌లోని తెలుగువారు సాయం చేయాలని నల్గొండలోని కుటుంబం విజ్ఞప్తి చేసిందని గల్టే, ఎం9 న్యూస్ పేర్కొన్నాయి. ఆమెను గుర్తించేందుకు చురుగ్గా ప్రయత్నిస్తున్నామని బోస్టన్ పోలీసులు తెలిపారు.