రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌ పట్టణ శివారులోని పరిగి రోడ్డులో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రానైట్‌ కంపెనీ సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

వేగంగా దూసుకొచ్చిన ఒక కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న రెండు బైకులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు పల్టీలు కొడుతూ రోడ్డు పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది.

కారులో ప్రయాణిస్తున్న ఒక వ్యక్తి ప్రమాద స్థలంలోనే తీవ్ర గాయాలతో మరణించాడు. మృతుడి వివరాలు ఇంకా తెలియరాలేదు.

బైకులపై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. వారిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు ప్రారంభించారు.