నారాయణపేట జిల్లా మక్తల్ మండలం జక్లేర్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు మెరుపు దాడి చేశారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్లను పోలీసులు పట్టుకున్నారు.
మాగనూరు మండలం పెద్దవాగు నుండి ఎలాంటి అనుమతులు లేకుండా టిప్పర్లలో ఇసుక తరలిస్తున్నారని పోలీసులకు పక్కా సమాచారం అందింది. ఈ సమాచారం ఆధారంగా మక్తల్ పోలీసులు జక్లేర్ సమీపంలో కాపు కాసి దాడులు నిర్వహించారు.
దాడుల్లో అక్రమంగా ఇసుక తరలిస్తున్న ఐదు టిప్పర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన టిప్పర్లను పోలీస్ స్టేషన్కు తరలించారు.
ఈ ఘటనకు సంబంధించి నిందితులపై కేసులు నమోదు చేసినట్లు ఎస్సై రాజు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.