అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైన తొలిరోజు నుంచే ఘర్షణలు మొదలయ్యాయి. ఈ ఘర్షణల నేపథ్యంలో పోలీసులు, అధికారులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి చర్యలు తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో పక్కా సమాచారంతో పోలీసులు ఓ పంజాబ్ గ్యాంగ్‌ను గుర్తించారు. ఆయుధాలతో సహా వారిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు మొత్తం నలుగురిని అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి ఒక రివాల్వర్, ఒక పిస్టల్, 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు.

అరెస్ట్ అయిన వారు తాము వైసీపీ అభ్యర్థికి సెక్యూరిటీగా వచ్చామని పోలీసులకు తెలిపారు.

ఇలాంటి వ్యక్తులు ఇంకా ఎంతమంది ఉన్నారన్న దానిపై పోలీసులు ప్రస్తుతం విచారణ జరుపుతున్నారు.