ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని గాంధీ సెంటర్‌లో ఉన్న ఓ జ్యువెలరీ షాప్‌లో మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో దుండగులు చోరీకి యత్నించారు. కత్తులతో షాపులోకి ప్రవేశించిన దొంగలు యజమానిపై దాడి చేశారు. అయితే, యజమాని ధైర్యంగా ప్రతిఘటించడంతో దుండగుల ప్రయత్నం విఫలమైంది. చోరీ చేయలేకపోయిన దొంగలు యజమాని సెల్‌ఫోన్‌ను లాక్కొని పారిపోయారు. ఈ ఘటనలో యజమానికి స్వల్ప గాయాలయ్యాయి. సీసీటీవీ విజువల్స్‌ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.