రాష్ట్రంలో సమగ్ర శిక్ష, పీఎం శ్రీ పథకాల కింద ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి కోసం విడుదలైన నిధులను ఖర్చు చేయడంలో విద్యాశాఖ యంత్రాంగం జాప్యం చేసింది. ఇప్పటివరకు రూ.80 కోట్లు విడుదల చేయగా, జిల్లాల్లో కేవలం రూ.19 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. రాష్ట్రస్థాయిలో నిధుల వినియోగం 23 శాతానికి మాత్రమే పరిమితమైందని అధికారులు తెలిపారు.
ఈ నిధుల వినియోగంపై పదిసార్లు వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహించినా అధికారుల్లో కదలిక రాలేదు. డీఈవోలకు పట్టు లేకపోవడం, సామర్థ్యం చాలకపోవడమే పనుల్లో జాప్యానికి కారణమని విద్యాశాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ నెల 23, 24 తేదీల్లో ప్రత్యేక బృందాలతో జిల్లాల్లో ఆడిట్ నిర్వహించనున్నారు.