సూర్యాపేట జిల్లా మోతె మండలం విభలాపురం గ్రామంలో నిమ్మల శ్రీకాంత్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఈ నెల 15వ తేదీ రాత్రి శ్రీరామ్‌నగర్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత విగ్రహం వద్ద అన్నదానం నిర్వహించారు. మరుసటి రోజు ఉదయం విగ్రహం వద్ద టెంట్ హౌస్ గిన్నెలు కడుగుతున్న సమయంలో వాగ్వాదం జరిగింది.
విభలాపురానికి చెందిన నిమ్మల శ్రీకాంత్, అదే గ్రామానికి చెందిన పనస శ్రీనివాస్, పనస శ్రీలత మధ్య ఈ వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో శ్రీకాంత్‌పై దాడి జరిగింది.
పనస శ్రీలత కర్రతో శ్రీకాంత్ తల, చెవిపై కొట్టింది. పనస శ్రీనివాస్ చేతులతో దాడి చేశాడు. ఈ దాడిలో శ్రీకాంత్‌కు తలపై గాయాలయ్యాయి.
దాడి జరిగిన మరుసటి రోజు శ్రీకాంత్ తన ఇంట్లో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.