భద్రాచలం పట్టణంలోని గోదావరి కరకట్ట దిగువన రెడ్డి సత్రం సమీపంలో గంజాయి సేవించిన ముగ్గురు యువకులను పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న ఎస్‌ఐ వి. సతీష్ బృందం వీరిని గుర్తించింది.

యువకులు అనుమానాస్పదంగా కనిపించడంతో పోలీసులు వారిని పరీక్షించారు. గంజాయి పరీక్షల్లో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది.

దీంతో పోలీసులు వారిని వెంటనే అరెస్టు చేశారు. అనంతరం వారిని డీ-అడిక్షన్ కేంద్రానికి తరలించారు.

పట్టణంలో గంజాయి వినియోగాన్ని అరికట్టేందుకు పోలీసులు నిరంతర నిఘా కొనసాగిస్తున్నారు. ఇలాంటి ఘటనలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.