విదేశాల్లో ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి టామ్‌కామ్‌ సంస్థ తమను మోసం చేసిందని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం టామ్‌కామ్‌తో ఉద్యోగాలు కల్పిస్తామని భరోసా ఇవ్వడంతోనే తాము ఆ సంస్థపై నమ్మకం పెట్టుకున్నామని బాధితులు తెలిపారు. ఉద్యోగం కచ్చితంగా వస్తుందని డబ్బులు కట్టించుకొని తమను మోసం చేశారని వారు ఆరోపించారు. చెల్లించిన ఫీజులు వెనక్కి ఇవ్వాలని నిరుద్యోగులు డిమాండ్ చేశారు. కార్మికశాఖ మంత్రి గడ్డం వివేక్ టామ్‌కామ్‌ జర్మన్ భాషా కార్యక్రమాన్ని ప్రారంభించిన సమయంలో ఈ సంస్థపై నమ్మకం పెరిగిందని వారు పేర్కొన్నారు.