యూకో బ్యాంక్‌ 1961 అప్రెంటిస్ చట్టం ప్రకారం అప్రెంటిస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల్లో మొత్తం 530 పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. తెలంగాణలో 8 ఖాళీలు ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో కూడా 8 ఖాళీలు ఉన్నాయి. అక్టోబర్‌ 29 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా నిర్ణయించారు. బ్యాంకింగ్ రంగంలో అప్రెంటిస్‌షిప్ చేయాలనుకునేవారికి ఇది ఒక మంచి అవకాశం.