తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయం ఎదుట నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. పరీక్ష తేదీలను మార్చాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలిపారు.
గత పది రోజులుగా పరీక్ష వాయిదా వేయాలని టీజీపీఎస్సీ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా తమ విజ్ఞప్తిని పట్టించుకోవడం లేదని నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు.
రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ఈ విషయమై రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే నిరుద్యోగులు పలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. తాజాగా టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు.
తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని, పరీక్ష తేదీలను మార్చాలని నిరుద్యోగులు కోరుతున్నారు.