అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లోని గ్రామీణ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం వదాన్య జన సొసైటీ డిసెంబర్ 13న టాలెంట్ టెస్ట్ నిర్వహించనుంది. ఈ పరీక్ష ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి ప్రోత్సహించనున్నారు.
సాఫ్ట్వేర్ నిపుణులు జి. అశోక్ నేతృత్వంలో వదాన్య జన సొసైటీ పేద గ్రామీణ నేపథ్యం నుండి వచ్చిన ప్రతిభావంతులైన విద్యార్థులకు మద్దతు ఇవ్వడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. వదాన్య టాలెంట్ టెస్ట్ 2026 పేరుతో ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు.
అనంతపురంలోని ఏఎఫ్ ఎకాలజీ సెంటర్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ పరీక్షకు సంబంధించిన పోస్టర్, ప్రశ్నపత్రాన్ని నిర్వాహకులు విడుదల చేశారు. ఈ సందర్భంగా పరీక్ష వివరాలను వెల్లడించారు.
ఈ టాలెంట్ టెస్ట్‌లో సుమారు 10,000 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పాల్గొంటారని అంచనా. ప్రతి జిల్లా నుండి 5,000 మంది విద్యార్థులను లక్ష్యంగా చేసుకున్నారు.