హైదరాబాద్ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళపై లైంగిక దాడి జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి ఓ యువకుడు ఈ దారుణానికి పాల్పడ్డాడు.

రాయదుర్గం నుండి ఇంటికి వెళ్తున్న మహిళకు ఆ యువకుడు మాయమాటలు చెప్పాడు. ఉద్యోగం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు.

ఆ తర్వాత ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెలుగులోకి రావడంతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు ప్రస్తుతం ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.