వరంగల్ జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన సూరారం సుజాత (60) ఆదివారం సద్దుల బతుకమ్మ వేడుకల్లో భాగంగా ఎనుమాముల కోటచెరువు వద్ద బతుకమ్మ ఆడుతుండగా గుండెపోటుకు గురయ్యారు.
స్థానిక మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతున్న సమయంలో ఆమె ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే అక్కడున్న వారు ఆమెను ఆసుపత్రికి తరలించారు.
సుజాతను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించారు.
ఈ ఘటనతో బతుకమ్మ వేడుకల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.