దాచేపల్లిలో వైసీపీ ఛైర్మన్‌ అభ్యర్థి కొప్పుల రవిని పోలీసులు అరెస్టు చేశారు. నామినేషన్ ప్రక్రియ కోసం భారీగా తెలంగాణ మద్యం తరలించినట్లు గుర్తించారు.

పోలీసులు రవి నివాసంలో సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో 429 సీసాల తెలంగాణ మద్యం పట్టుబడింది.

మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు రవిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

నామినేషన్ దాఖలుకు ముందు ఈ అరెస్టు జరగడం గమనార్హం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.