హైదరాబాద్లోని నాగోల్ మెట్రో స్టేషన్ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పల్ నుండి నాగోల్ వైపు వెళ్లే మార్గంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి 3 గంటల సమయంలో జరిగింది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
మృతుడిని సూర్యగా గుర్తించారు. ప్రమాదంలో కారు తీవ్రంగా దెబ్బతింది, నుజ్జునుజ్జు అయింది.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.