రాయచోటిలో వైసీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆయన బౌన్సర్ల వద్ద అనుమతి లేని తుపాకులు, లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
జిన్నా షరీఫ్‌కు బౌన్సర్లుగా ఉన్న నలుగురు వ్యక్తుల వద్ద సరైన పత్రాలు లేకుండా ఆయుధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వారి నుంచి రెండు తుపాకులు, లైవ్ తూటాలు స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి జిన్నా షరీఫ్‌తో పాటు ఆయన కుమారుడు, 15 మంది బౌన్సర్లపై రాయచోటి పోలీసులు ఆయుధ చట్టం కింద కేసు నమోదు చేశారు.
ప్రస్తుతం జిన్నా షరీఫ్, ఆయన బౌన్సర్లు అందరూ పోలీసుల అదుపులో ఉన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది.