హైదరాబాద్ నగరానికి తాగునీటిని అందించే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్-2 పైప్‌లైన్ ఉప్పల్ బాగాయత్ సమీపంలో దెబ్బతింది. నాగోల్ మెట్రో స్టేషన్ పిల్లర్ నంబర్ 813 వద్ద ఈ ఘటన జరిగింది.
ఒక కారు పైప్‌లైన్‌కు చెందిన ఎయిర్ వాల్వ్‌ల వ్యవస్థను బలంగా ఢీకొనడంతో ఈ నష్టం వాటిల్లింది. దీని కారణంగా నీటి లీకేజీ ఏర్పడిందని అధికారులు తెలిపారు.
దెబ్బతిన్న ఎయిర్ వాల్వ్‌లను మరమ్మత్తు చేయడానికి, అవసరమైన పునరుద్ధరణ పనులను చేపట్టడానికి జలమండలి అత్యవసర చర్యలు ప్రారంభించింది.
ఈ మరమ్మత్తుల వల్ల దసరా పండుగ సమయంలో హైదరాబాద్‌లోని కొన్ని ప్రాంతాలకు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి అధికారులు స్పష్టం చేశారు.



