హనుమకొండలోని పద్మాక్షిగుట్ట వద్ద శనివారం గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, మాజీ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాసర్‌ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఓరుగల్లు వైల్డ్‌ లైఫ్‌, వన సేవ సొసైటీలు సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. పర్యావరణ పరిరక్షణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ వ్యవస్థాపకుడు, రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్‌రావు ఈ సందర్భంగా మాట్లాడుతూ, పర్యావరణాన్ని కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యత అని నొక్కి చెప్పారు.

మొక్కలు నాటడం, వాటిని సంరక్షించడం ద్వారా భవిష్యత్‌ తరాలకు స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని సంతోష్‌రావు పేర్కొన్నారు.