బతుకమ్మ, దసరా పండుగలను పురస్కరించుకొని తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఈ ప్రత్యేక సర్వీసుల వల్ల హైదరాబాద్ నగర ప్రయాణికులపై భారం పడింది.
హైదరాబాద్లోని సిటీ బస్సులను జిల్లా సర్వీసులుగా మార్చి, ప్రత్యేక ఛార్జీలు వసూలు చేస్తున్నారు. దీనితో నగరంలో గత నాలుగు రోజులుగా బస్సుల కొరత ఏర్పడింది.
సిటీ బస్సులను జిల్లాలకు ప్రత్యేక సర్వీసుల పేర్లతో నడుపుతుండటంతో నగరంలో ప్రయాణించేందుకు ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
పండగ పేరిట 'ప్రత్యేకం'గా దోపిడీ జరుగుతోందని ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు. అధిక ఛార్జీలు వసూలు చేస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.



