హైదరాబాద్ నగరంలో డబుల్ డెక్కర్ బస్సు సర్వీసులు గత నెల రోజులుగా నిలిచిపోయాయి. నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ఈ బస్సులు ప్రస్తుతం షెడ్డుకే పరిమితమయ్యాయి.

పండుగ సెలవుల నేపథ్యంలో నగరాన్ని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులకు ఈ పరిస్థితి నిరాశ కలిగిస్తోంది. హుస్సేన్ సాగర్ పరిసరాల్లో ప్రయాణానికి ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులు పడుతున్నారు.

గతంలో హెచ్‌ఎండీఏ సుమారు రూ.13 కోట్ల వ్యయంతో ఆరు ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులను కొనుగోలు చేసింది. వీటిని అత్యంత వైభవంగా ప్రారంభించారు.

అయితే, హెచ్‌ఎండీఏ నుంచి నిర్వహణ బాధ్యతలను పర్యాటక శాఖ స్వీకరించిన తర్వాత వాటిని నడపడంలో విఫలమైంది. దీంతో సర్వీసులు నిలిచిపోయాయి.