హైదరాబాద్‌లోని కోఠి-ఎంజే మార్కెట్ రోడ్డులో ప్రయాణికులు ప్రతిరోజూ ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గమ్యస్థానాలకు చేరుకోవడానికి వాహనదారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

పండ్ల కోసం వచ్చే వాహనాలను రోడ్డుకు ఇరువైపులా నిలుపుతుండటంతో ఎంజే మార్కెట్‌లో ట్రాఫిక్ సమస్య తప్పడం లేదు. దీనివల్ల వాహనాల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది.

వాహనాలు, వ్యాపారులు, కొనుగోలుదారులతో ఈ మార్గం కిక్కిరిసిపోతోంది. కాలు పెట్టే సందు కూడా లేకుండా రద్దీగా మారిన ఈ ప్రాంతాన్ని దాటడం నిత్యం ఒక సవాలుగా మారింది.

కోఠి-ఉస్మానియా మెడికల్ కాలేజ్ మెట్రో రోడ్డులో కూడా రద్దీతో వాహనదారులు ప్రతిరోజూ ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో కూడా ట్రాఫిక్ సమస్యలు కొనసాగుతున్నాయి.