హైదరాబాద్: ఇండియన్ గోల్ఫ్ ప్రీమియర్ లీగ్ (ఐజీపీఎల్) ఫీనిక్స్ ఇన్విటేషనల్ టోర్నీలో 15 ఏళ్ల డానిష్ వర్మ దిగ్గజ గోల్ఫర్లను వెనక్కి నెట్టాడు. వూటీ గోల్ఫ్ కౌంటీలో గురువారం జరిగిన రెండో రౌండ్‌లో 66 (6 అండర్) స్కోరు చేసిన అతను మొత్తం 11 అండర్‌తో ఒక్క షాట్ ఆధిక్యంలో నిలిచాడు. తొలి రౌండ్‌లో అతను 67 (5 అండర్) నమోదు చేశాడు.
లీడర్‌బోర్డ్ (రెండు రౌండ్ల తర్వాత)
- -11: డానిష్ వర్మ (67-66)
- -10: గగన్‌జీత్ భుల్లర్ (66-68), శివ్ కపూర్ (68-66), హర్ష్‌జీత్ సింగ్ సేథీ (67-67)
- -9: రాఘవ్ చుగ్ (71-64), తుషార్ పన్ను, అర్జున్ ప్రసాద్, సచిన్ బైసోయా
లీగ్‌లో డానిష్ గ్రీన్ ఫ్యూయల్స్ వైజాగ్ డాల్ఫిన్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. రెండో రౌండ్‌లో 64 స్కోరుతో ఐదో స్థానానికి ఎగబాకిన రాఘవ్ చుగ్ ఫీనిక్స్ హైదరాబాద్ ఫైర్‌బర్డ్స్ జట్టు ఆటగాడు. ఆధిక్యంలో ఉన్న డానిష్‌కు రెండు షాట్ల దూరంలోనే ఎనిమిది మంది గోల్ఫర్లు ఉండటంతో చివరి రౌండ్ ఆసక్తికరంగా మారింది.




