దోహా: ఏసీసీ మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 టోర్నీలో హైదరాబాద్ క్రికెటర్ తిలక్ వర్మ సారథ్యం వహించిన భారత్-ఎ జట్టు సెమీఫైనల్లో నిష్క్రమించింది. గురువారం రాత్రి దోహాలో జరిగిన తొలి సెమీస్‌లో శ్రీలంక-ఎ 8 వికెట్ల తేడాతో భారత్-ఎను ఓడించింది.
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్-ఎ 50 ఓవర్లలో 8 వికెట్లకు 317 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ (78; 63 బంతుల్లో), షాబాజ్ అహ్మద్ (54 నాటౌట్; 48 బంతుల్లో), కెప్టెన్ తిలక్ వర్మ (53; 66 బంతుల్లో), వైభవ్ సూర్యవంశీ (40; 27 బంతుల్లో) రాణించారు.
అనంతరం 318 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక-ఎ ఓపెనర్లు లసిత్ క్రూస్పులే (116), సినెత్ జయవర్దెన (105) తొలి వికెట్‌కు 22 ఓవర్లలో 174 పరుగులు జోడించి సులభతరం చేశారు. ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు జారవిడవడంతో లంక-ఎ 41.3 ఓవర్లలో కేవలం 2 వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసి విజయం సాధించింది.
మ్యాచ్ అనంతరం తిలక్ వర్మ మాట్లాడుతూ తొలి 15 ఓవర్లలో పరుగులను నియంత్రించడంలో బౌలర్లు విఫలమయ్యారని, ఈ ఓటమి తమకు ఒక 'బ్యాడ్ డే' అని అన్నారు. ఆదివారం (నవంబర్ 29) దోహాలో ఫైనల్ జరగనుంది.




