జెరూసలేం / వరంగల్: అంతర్జాతీయ వేదికపై వరంగల్ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఎరిగైసి (ఎలో 2740) మరోసారి మెరిశాడు. నవంబర్ 23 నుంచి 26 వరకు మ్యూజియం ఆఫ్ టాలరెన్స్‌లో జరిగిన 2,50,000 డాలర్ల జెరూసలేం మాస్టర్స్-2026 టోర్నీలో అర్జున్ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
12 మంది క్రీడాకారులతో జరిగిన రౌండ్-రాబిన్ దశలో అగ్రస్థానంలో నిలిచి నాకౌట్‌కు అర్హత సాధించిన అర్జున్, సెమీఫైనల్‌లో సెర్బియాకు చెందిన అలెక్సీ సరానా చేతిలో 0.5–1.5 తేడాతో ఓటమి పాలయ్యాడు.
అనంతరం మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హాన్స్ మోకే నీమన్‌పై అర్జున్ ఆధిపత్యం చాటాడు. తొలి గేమ్‌లో నల్లపావులతో విజయం సాధించి, రెండో గేమ్‌లో తెల్లపావులతో డ్రా చేసుకుని మూడో స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.
ఈ ప్రదర్శనతో అర్జున్ 35,000 డాలర్ల ప్రైజ్‌మనీ అందుకున్నాడు. ఫైనల్‌లో అలెక్సీ సరానాను 3–2తో ఓడించిన వెస్లీ సో టైటిల్‌తో పాటు 1,01,000 డాలర్ల నగదు బహుమతిని గెలుచుకున్నాడు.




