జెరూసలేం / వరంగల్: తెలంగాణ తొలి చెస్ గ్రాండ్‌మాస్టర్, వరంగల్‌కు చెందిన అర్జున్ ఎరిగైసి అంతర్జాతీయ వేదికపై మరోసారి సత్తా చాటాడు. జెరూసలేంలో నవంబర్ 23 నుంచి 26 వరకు జరిగిన $250,000 (డాలర్ల) ప్రైజ్‌మనీ 'జెరూసలేం మాస్టర్స్ 2026' టోర్నీలో అర్జున్ మూడో స్థానంలో నిలిచాడు.
మూడో స్థానం కోసం జరిగిన ప్లేఆఫ్‌లో అమెరికా గ్రాండ్‌మాస్టర్ హాన్స్ నీమన్‌ను అర్జున్ 1.5–0.5 తేడాతో ఓడించాడు. 15+10 ర్యాపిడ్ టైమ్ కంట్రోల్‌లో జరిగిన తొలి గేమ్‌లో నల్లపావులతో గెలిచి, రెండో గేమ్‌ను డ్రా చేసుకుని $35,000 ప్రైజ్‌మనీ అందుకున్నాడు.
అంతకుముందు 12 మంది గ్రాండ్‌మాస్టర్లు తలపడిన రౌండ్-రాబిన్ దశలో అర్జున్ అగ్రస్థానంలో నిలిచి నాకౌట్ సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. అయితే సెమీస్‌లో అలెక్సీ సరానా చేతిలో 0.5–1.5 తేడాతో పరాజయం పాలయ్యాడు.
ఫైనల్లో వెస్లీ సో $101,000 ప్రైజ్‌మనీతో టైటిల్ గెలుచుకోగా, అలెక్సీ సరానా ($60,000) రెండో స్థానంలో నిలిచాడు.




