హైదరాబాద్: తెలంగాణలో తన తొలి అధికారిక రిటైల్ స్టోర్ 'ఆపిల్ కూకట్‌పల్లి'ని డిసెంబర్ 10 (గురువారం) సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నట్లు ఆపిల్ గురువారం ప్రకటించింది. కూకట్‌పల్లిలోని లేక్‌షోర్-వై జంక్షన్ మాల్‌లో ఈ స్టోర్‌ను ఏర్పాటు చేశారు.
భారత్‌లో ఆపిల్‌కు ఇది 7వ రిటైల్ స్టోర్ కాగా, దక్షిణ భారత్‌లో బెంగళూరు (ఆపిల్ హెబ్బాళ్) తర్వాత రెండోది. ఇప్పటికే ముంబై (BKC, బోరివలీ), దిల్లీ ఎన్సీఆర్ (సాకేత్, నోయిడా), పుణెలో ఆపిల్ స్టోర్లు ఉన్నాయి.
'సిటీ ఆఫ్ పెర్ల్స్'గా పేరుగాంచిన హైదరాబాద్ వారసత్వానికి ప్రతీకగా స్టోర్ బారికేడ్‌పై ముత్యాల ప్రేరణతో ఆపిల్ లోగోను రూపొందించారు. హైదరాబాద్‌లో ఆపిల్‌కు ఇప్పటికే ఆర్ అండ్ డీ, రిటైల్ కస్టమర్ కేర్ కేంద్రాలు ఉన్నాయి.
స్టోర్‌లో స్పెషలిస్టులు, క్రియేటివ్స్, జీనియస్‌లతో పాటు ఉచితంగా 'టుడే ఎట్ ఆపిల్' సెషన్లు నిర్వహిస్తారు. ప్రారంభానికి ముందు హైదరాబాద్ థీమ్ వాల్‌పేపర్లు, ఆపిల్ మ్యూజిక్ ప్లేలిస్ట్‌ను కంపెనీ విడుదల చేసింది.




