అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లోని రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరం నుంచి AI ఆధారిత నూతన R-26 ఇంజినీరింగ్ కరిక్యులం ప్రవేశపెట్టనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి (APSCHE) గురువారం ప్రకటించింది.
ఏఐసీటీఈ (AICTE) మోడల్ కరిక్యులం, అట్‌కమ్-బేస్డ్ ఎడ్యుకేషన్ ప్రమాణాలకు అనుగుణంగా 160 నుంచి 164 క్రెడిట్ల పరిధిలో ఈ పాఠ్యప్రణాళికను సిద్ధం చేశారు. ఇందులో బేసిక్ సైన్సెస్, కోర్ సబ్జెక్టులు, ఎలక్టివ్స్, ప్రాజెక్టులు, ఇంటర్న్‌షిప్‌లు ఉంటాయి.
కేవలం కంప్యూటర్ సైన్స్‌కే పరిమితం చేయకుండా AI, సెమీకండక్టర్లు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏరోస్పేస్, డిఫెన్స్, వ్యవసాయం, పోర్టులు, లాజిస్టిక్స్ వంటి రంగాలకు అనుగుణంగా అన్ని ఇంజినీరింగ్ బ్రాంచీల్లోనూ AIని భాగం చేశారు. ప్రోగ్రామింగ్, రియల్-వరల్డ్ డేటాసెట్స్, డిజైన్ థింకింగ్, మేధో సంపత్తి (IP) అవగాహనను తప్పనిసరి చేశారు.
విశ్వవిద్యాలయాలు తమ బోర్డ్ ఆఫ్ స్టడీస్, అకడమిక్ కౌన్సిల్స్ ద్వారా బ్రాంచ్ వారీ సిలబస్‌ను ఖరారు చేస్తాయని, అధ్యాపకులకు శిక్షణ, పరిశ్రమల భాగస్వామ్యాన్ని APSCHE సమన్వయం చేస్తుందని అధికారులు తెలిపారు.




