ముంబై: వచ్చే ఏడాది జనవరిలో జరిగే ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ 2027కు సన్నాహకంగా ఇంగ్లాండ్ అండర్-19 జట్టుతో జరగనున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు BCCI శనివారం భారత జట్టును ప్రకటించింది. వికెట్‌కీపర్-బ్యాటర్ భావిక అహిరేకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించగా, అనాది తగ్డేను వైస్ కెప్టెన్‌గా ఎంపిక చేశారు.
నవంబర్ 26న వడోదరలో తొలి టీ20తో సిరీస్ ప్రారంభమవుతుంది. రెండో టీ20 నవంబర్ 28న వడోదరలోనే జరుగుతుంది. అనంతరం మూడో టీ20 (డిసెంబర్ 1), నాలుగో టీ20 (డిసెంబర్ 3), ఐదో టీ20 (డిసెంబర్ 6) మ్యాచ్‌లకు సూరత్ ఆతిథ్యం ఇవ్వనుంది.
15 మంది సభ్యుల జట్టులో భావిక అహిరే (కెప్టెన్, వికెట్‌కీపర్), అనాది తగ్డే (వైస్ కెప్టెన్), ఇరా జాదవ్, నిధి మహతో, పూర్వ సివాచ్, మెహక్ నర్వాసే, మైత్రి మనియార్, ఈశ్వరి అవసరే, దీయా యాదవ్, శ్రేయా ఎస్. చవాన్ (వికెట్‌కీపర్), సమైరా రాఘవ్, కుమారి పాలక్, ఉమా కశ్వీ, అక్సా పర్మార్, పాలక్ సింగ్ ఉన్నారు.
ప్రపంచకప్‌కు ముందు యువ ఆటగాళ్ల కూర్పును, ఫామ్‌ను పరీక్షించుకోవడానికి ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్ కీలకం కానుంది.




