హైదరాబాద్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టును ప్రకటించారు. ఎడమచేతి వాటం పేసర్ సీవీ మిలింద్ కెప్టెన్‌గా, ఎం.అభిరథ్ రెడ్డి వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. బెంగాల్‌లో నవంబర్ 14 నుంచి హైదరాబాద్ మ్యాచ్‌లు మొదలవుతాయి.
జట్టు
సీవీ మిలింద్ (కెప్టెన్), ఎం.అభిరథ్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, పి.అమన్ రావు, కె.హిమతేజ, రాహుల్ రాదేశ్ (వికెట్ కీపర్), ఎం.సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేథ్, గణేశ్ గడుగు, తనయ్ త్యాగరాజన్, ప్రణవ్ వర్మ, ఎ.వేద్ రెడ్డి, సీటీఎల్ రక్షణ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, నిశాంత్ శరణు, రాహుల్ బుద్ధి, వై.హర్షిత్ సాయి.
స్టాండ్‌బైలు: ఎ.వైష్ణవ్ రెడ్డి, పి.సాయి వికాస్ రెడ్డి, ఆర్.దినేశ్ రాథోడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, జి.అనికేత్ రెడ్డి.
టోర్నీ వివరాలు
- టోర్నీ నవంబర్ 14 నుంచి డిసెంబర్ 6 వరకు
- లీగ్ దశ, సూపర్ లీగ్, నాకౌట్ పద్ధతిలో పోటీలు
- హైదరాబాద్ గ్రూప్–బీలో, ఆంధ్ర గ్రూప్–ఏలో ఉన్నాయి
రంజీ ట్రోఫీలో ఇటీవల జింఖానా మైదానంలో ఛత్తీస్‌గఢ్‌పై ఒక్క వికెట్ తేడాతో హైదరాబాద్ ఉత్కంఠ విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో అభిరథ్ రెడ్డి 68, తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ రాదేశ్ 72 పరుగులు చేశారు.




