హైదరాబాద్: దేశవాళీ టీ20 టోర్నీ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి హైదరాబాద్ జట్టు ఖరారైంది. నవంబర్ 14 నుంచి బెంగాల్లో జరిగే ఈ టోర్నీకి లెఫ్టార్మ్ పేసర్ సీవీ మిలింద్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. ఎం. అభిరథ్ రెడ్డి వైస్ కెప్టెన్. 17 మంది సభ్యులతో పాటు ఐదుగురిని స్టాండ్‌బైలుగా ఎంపిక చేశారు.
హైదరాబాద్ జట్టు
సీవీ మిలింద్ (కెప్టెన్), ఎం. అభిరథ్ రెడ్డి (వైస్ కెప్టెన్), తన్మయ్ అగర్వాల్, పి. అమన్ రావు, కె. హిమతేజ, రాహుల్ రాధేశ్ (వికెట్ కీపర్), ఎం. సాయి ప్రజ్ఞయ్ రెడ్డి (వికెట్ కీపర్), భవేశ్ సేథ్, గణేశ్ గడుగు, తనయ్ త్యాగరాజన్, ప్రణవ్ వర్మ, ఎ. వేద్ రెడ్డి, సీటీఎల్ రక్షణ్ రెడ్డి, అజయ్ దేవ్ గౌడ్, నిశాంత్ శరణు, రాహుల్ బుద్ధి, వై. హర్షిత్ సాయి.
స్టాండ్‌బైలు: ఎ. వైష్ణవ్ రెడ్డి, పి. సాయి వికాస్ రెడ్డి, ఆర్. దినేశ్ రాథోడ్, ఆశిష్ శ్రీవాస్తవ్, జి. అనికేత్ రెడ్డి.
స్టార్లు లేకుండానే
భారత జట్టుతో న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న తిలక్ వర్మ, మహ్మద్ సిరాజ్ ఈ టోర్నీకి అందుబాటులో లేరు. మరోవైపు బీసీసీఐ సీనియర్ మహిళల ఇంటర్ జోనల్ టీ20 టోర్నీకి సౌత్ జోన్ కెప్టెన్‌గా హైదరాబాద్‌కు చెందిన ప్రణవి చంద్ర ఎంపికైంది. టోర్నీ డిసెంబర్ 6 వరకు జరుగుతుంది; హైదరాబాద్ తొలి మ్యాచ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.




