హైదరాబాద్‌ / ముంబై: హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న 'బ్లూ క్లౌడ్‌ సాఫ్ట్‌టెక్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌' (NSE: BLUECLOUDS) ముంబైలో జరిగిన 3వ వరల్డ్‌ మేయర్స్‌ ఫోరమ్‌, 7వ ఆసియా సిటీస్‌ సమ్మిట్‌-2026లో తన AI సాంకేతికతలను ప్రదర్శించింది.

100కు పైగా దేశాల నుంచి మేయర్లు, నగర ప్రతినిధులు హాజరైన ఈ సదస్సులో సంస్థ రూపొందించిన AI ఆధారిత 'బ్లూహెల్త్‌' (BluHealth) కెమెరా ఆధారిత నాన్‌-ఇన్వేసివ్‌ హెల్త్‌ స్క్రీనింగ్‌ కియోస్క్‌, ఆసుపత్రులు-పాఠశాలల కోసం 'బయోస్టర్‌' (BioSter) సాంకేతికతలను ప్రదర్శించారు.

దీంతో పాటు నగర పాలన, పోలీస్‌ హెల్ప్‌లైన్ల కోసం యాక్సెస్‌ జీనీ, బ్లూఎడ్జ్‌, బ్లూరా సాగా, బ్లూవాణి (BluVaani) వంటి సావరిన్‌ AI ప్లాట్‌ఫామ్‌లను పరిచయం చేశారు. సంస్థ అమెరికా అధ్యక్షుడు డాక్టర్‌ కిరణ్‌ వెల్పుల 'AI, రియల్‌ సిటీస్‌' సెషన్‌లో ప్రసంగించారు.

పలు నగరాల ప్రతినిధుల నుంచి పైలట్‌ ప్రాజెక్టులపై ఆసక్తి వ్యక్తమైందని, ఇంకా ఎలాంటి బైండింగ్‌ ఆర్డర్లు సంతకం కాలేదని ఎక్స్ఛేంజీ ఫైలింగ్‌లో సంస్థ తెలిపింది. గురువారం సంస్థ షేరు ₹16.06 ఇంట్రాడే గరిష్ఠాన్ని తాకి, ₹15.78 వద్ద ముగిసింది.