హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో జరిగిన తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజ్‌లో భారత క్రీడాకారులు మూడు టైటిళ్లు గెలిచారు. పురుషుల సింగిల్స్‌లో తుషార్ సువీర్, మహిళల సింగిల్స్‌లో రక్షిత శ్రీ సంతోష్ రామ్‌రాజ్, పురుషుల డబుల్స్‌లో కృష్ణప్రసాద్ గరగ–పృథ్వీ కృష్ణమూర్తి రాయ్ విజేతలుగా నిలిచారు.