అమరావతి / న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయ సేవల డిజిటలీకరణలో భాగంగా రాష్ట్రవ్యాప్త AI ఆధారిత లీగల్ అసిస్టెంట్ ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేసేందుకు రైల్‌టెల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు ₹27.03 కోట్ల కాంట్రాక్ట్ లభించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (APTS) నుంచి నవంబర్ 21న లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ (LoA) అందినట్లు రైల్‌టెల్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో వెల్లడించింది.
పన్నులతో కలిపి ₹27.02 కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు కింద ప్లాట్‌ఫామ్ డిజైన్, అభివృద్ధి, అమలు, హోస్టింగ్ మరియు దీర్ఘకాలిక నిర్వహణ సేవలను రైల్‌టెల్ అందించనుంది. ఈ వ్యవస్థను గూగుల్ క్లౌడ్ ప్లాట్‌ఫామ్‌పై ఏర్పాటు చేయనున్నారు.
ప్రభుత్వ శాఖలకు సంబంధించిన న్యాయపరమైన సమాచారం, కేసుల పరిశీలన, డాక్యుమెంట్ల విశ్లేషణ వేగవంతం చేయడమే ఈ ప్లాట్‌ఫామ్ ప్రధాన ఉద్దేశం. మే 9, 2029 నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి కావాల్సి ఉందని కంపెనీ తెలిపింది.
ఇది పూర్తిగా దేశీయ కాంట్రాక్ట్ అని, ప్రమోటర్ గ్రూప్‌కు ఎలాంటి సంబంధిత పార్టీ లావాదేవీ లేదని రైల్‌టెల్ స్పష్టం చేసింది. కాగా, గత ట్రేడింగ్ సెషన్లో రైల్‌టెల్ షేరు ₹249.15 వద్ద ముగిసింది.




