లక్నో: లక్నోలోని బీబీడీ యూపీ బ్యాడ్మింటన్ అకాడమీలో జరుగుతున్న సయ్యద్ మోదీ ఇండియా ఇంటర్నేషనల్ సూపర్ 300 టోర్నీ ($250,000 ప్రైజ్ మనీ) మిక్స్డ్ డబుల్స్‌లో హైదరాబాద్ షట్లర్ సాత్విక్ రెడ్డి కనపురం – రేషిక ఉదయసూరియన్ జోడీ క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది.
గురువారం జరిగిన ప్రీ-క్వార్టర్ ఫైనల్లో సాత్విక్–రేషిక జోడీ 56 నిమిషాల పాటు సాగిన పోరులో భారత్‌కే చెందిన ఆయుష్ మఖిజా–అనఘా అరవింద్ పైపై 22-20, 21-23, 21-14 తేడాతో విజయం సాధించింది.
అయితే తెలుగు ఆటగాళ్లు కే. మనీషా–ధ్రువ్ రావత్ (7వ సీడ్) జోడీ 16-21, 15-21తో ఇండోనేషియా జంట చేతిలో ఓడిపోగా, పురుషుల డబుల్స్‌లో భార్గవ్ రామ్ ఆరిగెల–విశ్వతేజ్ గొబ్బూరు జోడీ 20-22, 21-23తో సాయి ప్రతీక్–రుబన్ కుమార్ చేతిలో పోరాడి ఓడింది. టోర్నీలో టాప్ సీడ్ ధ్రువ్ కపిల–తనీషా క్రాస్టో (20-22, 15-21) కూడా సంచలన ఓటమిని చవిచూశారు.
మహిళల సింగిల్స్‌లో తన్వి శర్మ, ఉన్నతి హుడా, తస్నీమ్ మీర్, అన్మోల్ ఖర్బ్ క్వార్టర్స్ చేరారు. శుక్రవారం (నవంబర్ 27) మధ్యాహ్నం 12:00 గంటలకు కోర్ట్-1లో జరిగే క్వార్టర్ ఫైనల్లో విరాజ్ కువాలే–రుతపర్ణ పాండాతో సాత్విక్–రేషిక తలపడనున్నారు.




